టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం చినికి చినికి గాలివానలాగా మారింది. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నరేష్ పవిత్ర మైసూర్‌లోని హోటల్లో ఉండగా... ఆయన భార్య రమ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పోలీసులతో కలిసి హోటల్‌కు వెళ్లింది.
ఇప్పుడు ఈ వార్తలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు హోటల్‌కు వెళ్లి రాత్రులు గడపాల్సిన అవసరం ఏంటని నరేష్ భార్య రమ్య ప్రశ్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం విడాకులు చెల్లవని ఆమె అంటున్నారు. తాజాగా రమ్య చేసిన వ్యాఖ్యలపై నటి పవిత్ర కూడా స్పందించారు.
తాను కర్నాటక నుంచే టాలీవుడ్‌కు వచ్చానన్నారు. చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తూ అందరికి దగ్గరయ్యానన్నారు. తన సమస్యను అందరితో పంచుకోవాలని వీడియో విడుదల చేస్తున్నానని తెలిపారు పవిత్ర. నటుడు నరేశ్ గురించి మీ అందరికీ తెలుసన్నారు. తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నరేశ్ భార్య అని చెప్పి రమ్య అనే మహిళ బెంగళూరు వచ్చి తన గురించి చెడ్డగా మాట్లాడిందని వాపోయారు.
రమ్య చెప్పినట్టు ఏమీ లేదని ప్రజలకి చెప్పాలనిపించిందన్నారు పవిత్ర లోకేష్. భర్త కావాలని అనుకుంటే, కుటుంబంలో సెట్ చేసుకోవాలన్నారు. కుటుంబంతో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. తెలుగులో నరేష్ ఫేమస్ యాక్టర్. ఆయన భార్య అంటూ బెంగళూరుకు వచ్చి ఎందుకు చెబుతోంది? రమ్యకు ఏదైనా సమస్య వుంటే హైదరాబాద్‌లో కదా చెప్పాల్సిందన్నారు పవిత్ర.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మరోసారి సీనియర్ నటి పవిత్రను నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఈ వార్తలు గత కొన్నిరోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మూడో భార్య రమ్య ఎంట్రీతో ఈ వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడినట్లు అయ్యింది. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.