పవిత్రతో తనకు పెళ్లైందన్నారు సుచేంద్ర ప్రసాద్. 16 ఏళ్ల క్రితం తాము హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులైనట్టు సుచింద్రప్రసాద్ తెలిపారు. తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలున్నాయన్నారు. తన పాస్‌పోర్టులో భార్యగా పవిత్ర, అలాగే ఆమె పాస్‌పోర్టులో భర్తగా తన పేరు నమోదైనట్టు ఆయన చెప్పారు.
ఆధార్‌కార్డులో కూడా తమ పేర్లు భార్యభర్తలుగా నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకంగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారన్నారు. ఆదర్శదంపతులుగానే ఉన్నామని చెప్పడం గమనార్హం. పవిత్రపై తనకు ఇప్పటికీ గౌరవం వుందన్నారు. ఈ పరిణామాల వెనుక ఎవరో ఉన్నట్టు ఆయన అనుమానించారు.