నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్ గదిలో ఉండగా... నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె... వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చారు.ఆ తర్వాత వీరి వ్యవహారంపై మీడియాలో కూడా భారీగానే కథనాలు వచ్చాయి.
అయితే గతంలో నరేష్ పవిత్ర.. తమ రిలేషన్ పై బహిర్గంగానే కామెంట్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని.. పెళ్లి చేసుకోలేదని.. తమని సపోర్ట్ చేయాలని.. చెప్పుకొచ్చారు. చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తూ అందరికి దగ్గరయ్యానన్నారు పవిత్ర. నటుడు నరేశ్ గురించి మీ అందరికీ తెలుసన్నారు. తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నరేశ్ భార్య అని చెప్పి రమ్య అనే మహిళ బెంగళూరు వచ్చి తన గురించి చెడ్డగా మాట్లాడిందని వాపోయారు.