నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్ గదిలో ఉండగా... నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె... వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చారు.ఆ తర్వాత వీరి వ్యవహారంపై మీడియాలో కూడా భారీగానే కథనాలు వచ్చాయి.
సీనియర్ నటుడు నరేష్... పవిత్ర లోకేష్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నరేష్ నటించిన పలు చిత్రాల్లో పవిత్ర లోకేష్ భార్యగా, చెల్లిగా చేశారు.తాాజాగా వీరిద్దరు కలిసి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో కూడా కలిసి నటించారు.