మిర్చి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం: 15.11 కోట్లు..సీడెడ్: 7.51 కోట్లు..ఉత్తరాంధ్ర: 4.20 కోట్లు...ఈస్ట్: 2.90 కోట్లు.. వెస్ట్: 2.65 కోట్లు..గుంటూరు: 3.71 కోట్లు..కృష్ణా: 2.75 కోట్లు..నెల్లూరు: 1.67 కోట్లు..ఏపీ-తెలంగాణ టోటల్: 35.39 కోట్లు..రెస్టాఫ్ ఇండియా: 4.30 కోట్లు..కర్ణాటక: 3.63 కోట్లు..ఓవర్సీస్: 2.90 కోట్లు..వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 47.70 కోట్లు షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ సినిమాల తర్వాత వచ్చిన రెబల్ దారుణంగా నిరాశ పరిచింది. ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఏర్పడింది. ఆ సమయంలో వచ్చిన మిర్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. అప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా రూ. 30 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ జరిగింది. అయినా కూడా మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది మిర్చి. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 17 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. (Twitter/Photo)