పక్కా కమర్షియల్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు కామన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయంటూ సెన్సార్ వాళ్లు కొనియాడినట్టు సమాచారం. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలకు లాక్ చేశారు. (Twitter/Photo)
‘సక్కా కమర్షియల్’ చిత్రం తాలుకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్‌ను మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది టీమ్. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను వదిలింది టీమ్. ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఈ సినిమాలో గోపీచంద్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు రాశీ ఖన్నా లాయర్ (Raashi Khanna) రోల్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ల ధరల విషయంలో టీమ్ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. Photo : Twitter
ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండునుంది. ఇక అటు ఆంధ్రలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండనుందని ప్రకటించారు. అయితే ఇంత తక్కువులో ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ విషయంపై నెటిజన్స్ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. వచ్చే అన్ని సినిమాలకు ఇదే రేట్లు కంటీన్యూ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. Photo : Twitter
ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి గోపీచంద్ ఫ్యామిలీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. అందాల రాశి అంటూ సాగే ఈ పాట బాగుంది. నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. కృష్ణ కాంత్ రాశారు. శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా విడుదల విషయంలో అనేక వాయిదాలు వచ్చాయి. ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి (Maruthi) చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ (Pakka Commercial) సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. Photo : Twitter
ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది. Photo : Twitter
ఇక గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు చిరంజీవి కూడా మారుతిని తనతో సినిమా చేయమని చెప్పిన విషయం తెలిసిందే కదా. Photo : Twitter