పక్కా కమర్షియల్ మూవీ మేకర్స్ తమ సినిమాను పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పకుంటున్నా.. ఓవరాల్‌గా ఈ సినిమా థియేట్రికల్‌గా ఎంత వరకు వసూళ్లను రాబడుతుందనే దానిపై ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులైన ‘డిజిటల్, శాటిలైట్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. (Twitter/Photo)
మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. మొత్తంగా డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ సినిమా రూ. 31 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి ముందు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
గోపీచంద్ గత కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న ఈ సినిమాకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ భారీ హైప్ తీసుకొచ్చింది. మొత్తంగా డిజిటల్ హక్కుల రూపంలో రూ. 16 కోట్లు వస్తే.. శాటిలైల్ రూపేణా రూ. 15 కోట్లు రాబట్టింది. 31 కోట్ల నాన్ థియేట్రికల్ ప్రాఫిట్ నిర్మాతలకు అంందింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)
‘సక్కా కమర్షియల్’ చిత్రం తాలుకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్‌ను మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు చేసుకున్న ఒప్పందం ప్రకారం విడుదలైన 7 వారాలు అంటే స్ట్రీమింగ్కు ఇస్తారా అనేది చూడాలి. Photo : Twitter
ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండునుంది. ఇక అటు ఆంధ్రలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉంది. అయితే ఇంత తక్కువులో ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ విషయంపై నెటిజన్స్ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. వచ్చే అన్ని సినిమాలకు ఇదే రేట్లు కంటీన్యూ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. Photo : Twitter
పక్కా కమర్షియల్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 9 కోట్లు.. మొత్తంగా.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 17.50 కోట్లు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 0.50 కోట్లు ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 20 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
ఫక్కా కమర్షియల్ చిత్రాన్ని తెలంగాణ (నైజాం)లో 235 థియేటర్స్‌లో విడుదల చేస్తే.. రాయలసీమ (సీడెడ్)లో 120 + ఏపిలో 270 పైగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. మొత్తంగా తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి 625 పైగా థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేయనుంది. ఇక రెస్టాఫ్ భారత్ 80, ఓవర్సీస్ కలిపితే 250 పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. మొత్తంగా 955 అంటే.. దాదాపు 1000 వరకు స్క్రీన్స్‌లో పక్కా కమర్షియల్ మూవీ స్క్రీనింగ్ కానుంది. గోపీచంద్ కెరీర్లో ఇన్ని థియేటర్స్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. (Twitter/Photo)
ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది. Photo : Twitter