ప్రతి యేడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా కేంద్రం ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. గతేడాది కేజీఎఫ్ 2లో ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రలో నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో అట్రాక్ట్ చేసింది. Twitter/Photo)
‘దిల్ వాలే’, ‘మొహ్రా’ ఈ రెండు చిత్రాలు యాక్షన్‌తో పాటు ఈ సినిమాలోని పాటలు అప్పుడు ట్రెండ్ సెట్ చేసాయి. ముఖ్యంగా ‘మొహ్రా’లో తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ బాలీవుడ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటలో రవీనా టాండన్ అందాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. (Instagram/Photo)
తెలుగులో అక్కినేని నాగేశ్వరావు, వినోద్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘రథ సారధి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వా త నందమూరి బాలకృష్ణ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత పాటలో తన తడి అందాలతో ఇక్కడి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. (Twitter/Photo)
సెకండ్ ఇన్నింగ్స్‌లో హిందీకి సంబంధించిన పలు ఛానెల్స్‌లో రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు దామన్ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకున్నారు. మొత్తంగా ఈమె తన నటనతో అప్పటి తరంతోపాటు ఇప్పటి తరాన్ని కూడా ఉర్రూతలూగించిన ఈ భామకు కేంద్రం పద్మశ్రీతో గౌరవించడంపై బాలీవుడ్ సహా టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (Instagram/Photo)