కరోనా సమయంలో థియేటర్స్‌కు కాకుండా ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడాలంటే అందులో కంటెంట్ బాగుంటేనే ఆ వైపు కదులుతున్నాడు. టాక్ కాస్త తేడా వచ్చినా.. రెండు మూడు వారాలు ఆగితే.. ఎలాగు ఓటీటీలో వస్తోంది కాబట్టి థియేటర్స్‌కు వెళ్లడం కామన్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ తగ్గించేశారు. (Twitter/Photo)
నిర్మాతలకు ఓటీటీ వల్ల వారు పెట్టిన పెట్టుబడి తొందరగా రికవరీ అయ్యే అవకాశాలుండటంతో చాలా మంది నిర్మాతలు విడుదలైన మూడు వారాలకే తమ సినిమాలను ఓటీటీ స్ట్రీమింగ్కు ఇచ్చేస్తున్నారు. విడుదలైన తక్కువ రోజులకే.. ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు హక్కులు అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా మంది నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఆ సినిమా థియేటర్స్‌లో రూ. 300 పెట్టి చూసేకంటే.. అదే డబ్బులతో సంవత్సరం చందా తీసుకుంటే.. మొత్తం సినిమాలను చూసేయచ్చు అనే రీతిలో ఆలోచిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ ముఖంగా చూడక వాటి ఉనికి ప్రశ్నార్ధకం అయ్యేలా చేస్తోంది.
ఒకవైపు ఓటీటీలు.. థియేటర్స్‌లో పెరిగిన టికెట్ ధరలు సామాన్యులను థియేటర్స్‌కు దూరం చేస్తున్నాయి. పెరగిన టికెట్ రేట్స్ వల్ల ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలకు మంచి లాభాలనే గడించాయి. కానీ చిరంజీవి ఆచార్యకు అదే టికెట్ రేట్ కొంప ముంచింది. మరోవైపు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు టికెట్స్ రేట్స్ పెరుగుదల వల్ల రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు నష్టపోయింది. అదే తక్కువగా ఉంటే.. కలెక్షన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండేవి. మరోవైపు ఎఫ్ 3 కూడా పెరిగిన టికెట్స్ కారణంగా లాభాల్లోకి రాలేదు. దీంతో ఇపుడు కొత్త సినిమాలు ఓటీటీ విడుదలపై టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. (Twitter/Photo)
ఇకపై టాలీవుడ్లో విడుదలయ్యే చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ తరవాత 50 రోజులకు ఓటిటికి ఇవ్వాలని టాలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జూలై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలన్నీ 50 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. మరి టాలీవుడ్ నిర్మాతలందరూ ఓటీటీ దెబ్బకు ఇపుడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ విషయమై తెలుగు చిత్ర నిర్మాతలందరూ ఒకే మాటపై నిలబడతారా లేదా అనేది చూడాలి. Photo Twitter