ఓటిటి రిలీజ్ అంటే ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుందా..?

OTT release: క‌రోనా వైరస్ కారణంగా థియేటర్స్ అన్నీ మూసేయడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసారు.. ఇంకా చేస్తున్నారు.. చేస్తూనే ఉంటారు కూడా. కీర్తి సురేష్. అమితాబ్ బచ్చన్. జ్యోతిక లాంటి స్టార్స్ సినిమాలు కూడా నేరుగా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. చివరికి అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా గులాబో సితాబో సైతం జస్ట్ ఓకే అనిపించింది కానీ సూపర్ కేక అనిపించలేదు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఓటిటిలో విడుదలైన ఏ సినిమా కూడా హిట్ అనిపించుకోలేదు.