ఇటు ఓటీటీలో అటు సోషల్ మీడియాలో సమంత క్రేజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటోంది. ఇటీవలే ఎఫ్‌సి డిస్రప్టర్స్-2021 జాబితాలో బెస్ట్‌గా నిలిచింది. ఎఫ్‌సీ 2021 టాప్ 20 లిస్ట్‌లో సమంత 8వ స్థానంలో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది. నటుడు రాహుల్ రవీంద్రన్, సుమన్ లాంటి సెలబ్రిటీలతోపాటు, ఆప్ నేత, న్యాయవాది సోమనాథ్ భారతి కూడా సమంతాను అభినందిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. అయితే విడాకుల తరువాత ఆమె కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతోంది.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది సమంత. అది అలా ఉంటే సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..' అంటూ ఓ కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.