ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. తాజాగా మన దేశం నుంచి ఆస్కార్‌కు షార్ట్ లిస్టులో RRR, కాంతారా, ది కశ్మీర్ ఫైల్స్,,గంగుబాయ్ కఠియావాడి, విక్రాంత్ రోణ సహా మొత్తం 5 చిత్రాలు ఆస్కార్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో రెండు కన్నడు చిత్రాలు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ఉండటం విశేషం. (Twitter/Photo)
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ యేడాది మన దేశం తరుపున తాజాగా 2023లో ఆస్కార్ బరిలో ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్టులో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో విభాగంలో నామినేట్ అయింది.(File/Photo)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాల బైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్యాన్ ఇండియా ఆయా భాషల్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఈ పాటకు కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకుంటాడా అనేది చూడాలి. ఫస్ట్ భారతీయ పాట ఈ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. ఫైనల్ లిస్ట్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి గెలుస్తుందా అనేది చూడాలి. (Twitter/Photo)
ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘కాంతారా’ మూవీ కూడా నిలిచింది. ఈ సినిమా గతేడాది దసరా కానుకగా విడుదలై కన్నడతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపిక కావడంపై కన్నడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉత్తమ నటుడు కేటగిరిలో కూడా రిషబ్ శెట్టి ఆస్కార్ షార్ట్ లిస్టులో చేరింది. (File/Photo)
అటు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబర్తి ముఖ్యపాత్రల్లో నటించిన ‘ది కశ్మీర్ ఫైల్’ సినిమా 90వ దశకంలో కశ్మీర్ పండితులపై జరిగిన ఇస్లామిక్ దారుణ మారుణ కాండను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించాడు. ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు ఈ సినిమా పై పలు వివాదాలు కూడా తలెత్తాయి. ఆ సంగతి పక్కన పెడితే .. ఈ సినిమా ఆస్కార్ ఉత్తమ చిత్ర కేటగిరి షార్ట్ లిస్టు అయింది. అటు మరాఠీ ఫిల్మ్ ‘మీ వసంతరావ్ అండ్ తుజ్హియా సాథి కహీ హి, మరియు ఆర్. మాధవన్ ఝ‘ది నంబి ఎఫెక్ట్’ తో పాటు ఇరావిన్ నిలాల్ చిత్రాలు షార్ట్ లిస్టులో నిలిచాయి. (Twitter/Photo)
ఇక మన దేశం తరుపున ‘లాస్ట్ ఫిల్మ్ చలో షో’ అనే గుజరాతీ సినిమా మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలుస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2023 ఆస్కార్ బరిలో మన దేశం తరుపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.అటు ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్టులో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపికైంది. అటు ఆల్ ది బ్రీత్స్’ సినిమా బెస్ట్ డాక్కుమెంటరీ మూవీగా షార్ట్ లిస్ట్ అయింది. అటు ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. (Twitter/Photo)
బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఎంపికైన ‘ది లాస్ట్ ఫిల్మ్’ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో డైరెక్టర్ నలిన్ తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. అతను చిన్నపుడు సినిమాలపై ఎలా ఆకర్షితుడు అయ్యాడు. సినిమాలపై ఎలా ఇష్టాన్ని పంచుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మన దేశం తరుపున 2023లో ఆస్కార్ బరిలో నిలిచింది. (Twitter/Photo)
గుజరాత్ స్టేట్‌లో అప్పటి విలేజ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు దర్శకుడు నలిన్ ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. తొమ్మిదేళ్ల ఒక బాలుడు స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, పరేష్ మెహతా లీడ్ రోల్స్‌లో నటించారు. ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (ఇంగ్లీష్) పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. అంతేకాదు అక్కడ అవార్డులను కూడా కొల్లగొట్టింది. (Twitter/Photo)
సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా కారణంగా గత రెండు పర్యాయాలు ఆలస్యం అయింది. గతేడాది మన దేశం తరుపున సూర్య జై భీమ్, మరక్కార్ సహా పలు చిత్రాలు పోటీ పడినా.. చివరకు కూజంగల్’ మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కానీ నామినేషన్లో చోటు సంపాదించుకోలేకపోయింది. (File/Photo)
ఈ సినిమాలు షార్ట్ లిస్టులో ఎంపికైనా.. ఫైనల్ లిస్టులో ఎంపిక కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో వేటికి ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ సారైనా మన భారతీయ చిత్రాల్లో ఏదైనా విదేశీ కేటగిరిలో అవార్డు సాధిస్తుందా అనేది చూడాలి. (File/Photo)