Oscar Awards - Academy Awards 2023 | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ అవార్డు ఎపుడు ఎలా ప్రారంభమైంది. దానికి సంబంధించిన విషయాలేంటో చూద్దాం..
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్ అసలు పేరు ఏమిటి ? బెస్ట్ యాక్టర్ ఫస్ట్ టైమ్ ఈ అవార్డు ఎవరు అందుకున్నారు ? ఎక్కువ సార్లు ఆస్కార్ గెలిచిన వారు ఎవరు ? ఉత్తమ నటిగా తొలిసారి ఈ అవార్డు అందుకున్న లేడీ ఎవరు ? 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఆస్కార్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో చూద్దాం. (File/Photo)
ఆస్కార్ అవార్డులను ముందు ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (Academy Of Motion Picture arts and Sciences) అందించే ట్రోఫీని మొదట ‘అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్’గా పిలిచేవారు. ఆ తర్వాత అది ఆస్కార్గా మార్పు చెందింది. దీని వెనక పెద్ద కహాని ఉంది. అవార్డు మొదలు పెట్టినపుడు అకాడమీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన మార్గరెట్ హెర్రిక్ ఆ ట్రోఫీ అచ్చం తన అంకుల్లా కనిపిస్తుందని చెప్పాడట. ఆ తర్వాత హాలీవుడ్ జర్నలిస్ట్ తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్గా పేర్కొన్నాడు. అలా అప్పటి నుంచి ఆస్కార్ పేరు దీనికి స్ధిరపడిపోయింది.
ఆస్కార్ అదేనండి అకాడమీ అవార్డులను ముందుగా 1929లో ప్రారంభమైంది. తొలిసారి ఈ వేడకలో 270కి పైగా గెస్ట్‌లు హాజరయ్యారు. ఇక అవార్డుల వేడుకలను ప్రసారం చేయడాన్ని 1953 నుంచి స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 200 పైగా దేశాల ప్రజలు ఆస్కార్ వేడుకలను చూసెందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. (File/Photo)
‘క్యాబరెట్’ మూవీలో నటనకు 1972లో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న లిజా మిన్నెల్లికి ఓ స్పెషాలిటీ ఉంది. ఆమె తల్లిదండ్రులు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు వివిధ విభాగాల్లో ఈ అవార్డులు అందుకున్నారు. లిజా మదర్ జ్యూడీ గార్లాండ్ 1939లో హానరరీ అవార్డు.. ఆమె తండ్రి వెన్సెంట్ మెన్నెల్లి 1958లో బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డు అందుకోవడం విశేషం. (File/Photo)
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఒకే సినిమా నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు ఎవరు గెలుచుకోలేదు. ‘ఏ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిసైర్’ (1951) విషయంలో బెస్ట్ యాక్టర్, 1976లో విడుదలైన ’నెట్వర్క్’ సినిమాలోని బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మాత్రం మిస్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఆ అవార్డులు అందుకొని ఉంటే ఆస్కార్ అవార్డుల్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసి ఉండేవి. (File/Photo)