95th Oscar Academy Awards : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. 2023లో చాలా మంది తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. (News18/Craative)
ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ పాట కూడా పాడారు. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట నామినేషన్ పొందింది. కీరవాణితో నాటు నాటు పాట రచయతగా చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. ఇక ఈరేసులో తెలుగు సినిమా ఆస్కార్ పొంది భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
The Elephant Whisperers | ఆస్కార్ కార్యక్రమంలో మరో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్‌ను గెలుచుకుంది. మన దేశం నుంచి నామినేట్ అయిన డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్. హాలౌట్, హౌ డూ యూ మేజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్రెంజర్ ఎట్ ది గేట్.. పోటీ పడ్డాయి.. ఈ డాక్యుమెంటరీని కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మెంగా నిర్మించారు. వీళ్లిద్దరు ఈ అవార్డును తొలిసారి అందుకోవడం విశేషం.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ - ‘గులెర్మో డెల్ టోరోస్ పినోచియో’.. | బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా గులెర్మో డెల్ టోరోస్ పినోచియో చిత్రం అవార్డ్ గెలిచింది. మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్, పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్, ది సీ బీస్ట్, టర్నింగ్ రెడ్ పోటీ పడ్డాయి. ఈయన ఆస్కార్ బరిలో మొదటిసారి బెస్ట్ పిక్చర్తో పాటు బెస్ట్ డైరెక్టర్‌గా.. బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్‌గా ఈ సినిమా ఆస్కార్ గెలవడం విశేషం .