నిజానికి తనకు 23 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోతుందని అనుకుందట సాయి పల్లవి. అంతేకాదు 30 సంవత్సరాలు వచ్చేసరికి తనకు ఇద్దరు పిల్లలుంటారని కూడా అనుకున్నా అంటూ సాయి పల్లవి చెప్పడం గమనార్హం. అదేవిధంగా తనకు పుట్టపర్తి సాయి బాబా పేరు పెట్టారని, పాలు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారని చెప్పింది ఈ నాచురల్ బ్యూటీ.