సున్నాకు విలువ లేదు అంటారు. కానీ ఈ మాట ఎక్కడైనా అనొచ్చు కానీ హీరో గోపీచంద్ ముందు అంటే మాత్రం కొట్టేస్తాడు. ఎందుకంటే ఈయన కెరీర్‌ను జీరో మార్చేసింది. ఆ జీరోనే ఈయన్ని హీరోగా నిలబెట్టింది. అప్పుడప్పుడూ సున్నా నిజంగానే గుండుసున్నా చూపించినా కూడా ఎక్కువసార్లు మాత్రం జీరోతో సక్సెస్ అయ్యాడు గోపీచంద్. ఈయన కెరీర్‌ను మార్చేసిన చాలా సినిమాల టైటిల్స్ చివర్లో సున్నా ఉంటుంది.
ఇన్ని సినిమాల్లో శంఖం, సౌక్యం, పంతం మాత్రమే అంచనాలు అందుకోలేదు. మిగిలిన అన్ని సినిమాలు కూడా గోపీచంద్‌కు మంచి పేరుతో పాటు క్రేజ్ కూడా తీసుకొచ్చాయి. విలన్‌గా సూపర్ స్టార్ అయిన తర్వాత హీరో అయ్యాడు గోపీచంద్. అక్కడ్నుంచి కూడా సున్నా సెంటిమెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నాడు ఈ మ్యాచో హీరో. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్.. శ్రీవాస్‌తో సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో శ్రీవాస్ సినిమాకు లక్ష్యం 2 అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అప్పటి కథకు సంబంధం లేకపోయినా కూడా ఈ టైటిల్ అయితే బాగుంటుందని శ్రీవాస్ టీమ్ ఆలోచిస్తుంది. అందుకే లక్ష్యం 2 టైటిల్ ఫిక్స్ చేసేలా కనిపిస్తున్నారు. పైగా ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. లక్ష్యం, లౌక్యం తర్వాత మూడోసారి జత కడుతున్నారు గోపీచంద్, శ్రీవాస్.