2005లో, తమన్నా తన పదిహేనేళ్ల వయసులో 'చాంద్ సా రోషన్ చెహరా' చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ సినిమా విజయం సాధించలేదు. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడూ విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి.
హ్యాపీడేస్ సక్సెస్ తర్వాత తమన్నా స్టార్ డమ్ అమాంతం పెరిగింది. అయన్ (2009), కండేన్ కాదలై (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరం (2014) వంటి సినిమాల ద్వారా తమిళ్ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది.
తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. తమన్న అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్... Tamannah Instagram
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer). ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter
తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2020లో లాక్ డౌన్ సమయంలో సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది తమన్నా. దాదాపు 17 ఏళ్ల కింద ఈమె తొలిసారి స్క్రీన్‌పై కనిపించింది. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాల్లోకి వచ్చేసింది.Photo : Instagram Tamannah instagram
శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అప్పట్లో మంచు మనోజ్‌తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే నటించింది తమన్నా. దానికంటే ముందుగానే ఓ కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా.పగలు 10 ఎగ్జామ్స్ రాసి.. మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు మూడు రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. Photo : Instagram