Vaarasudu : గత కొన్నేళ్లుగా తెలుగులో పాత సినిమా టైటిల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో విజయ్ ‘వారసుడు’ మూవీ కూడా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున హీరోలుగా నటించిన ’ వారసుడు’ టైటిల్ కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైయింది. మరి ఆ బాటలో విజయ్ వారసుడు తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. (File/Photo)
స్వాతి ముత్యం | కళా తపస్వీ కే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీ ‘స్వాతి ముత్యం’ . ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ నటనను ఎవరు మరిచిపోలేరు. ఇప్పటికీ ఎవరైన అమాయకుడు లాంటి వారు కనిపిస్తే.. స్వాతిముత్యంలా ఉన్నాడే అని జోక్ చేస్తుంటారు. గతేడాది అదే ’స్వాతి ముత్యం’ టైటిల్‌తో బెల్లంకొండ సురేష్ బాబు రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా సినిమా చేసాడు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. (File/Photo)
Old Titles - Vikram To Major | ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత సినిమా టైటిల్స్‌తో తమ సినిమాలను ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. కథ డిమాండ్ చేయడంతో చాలా మంది హీరోలు పాత సినిమాల టైటిల్స్‌ను తమ సినిమాలకు పెడుతూ.. ఆయా సినిమాలపై క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు. అందులో కొంత మంది పాత సినిమాల క్లాసిక్ టైటిల్స్‌ను చెడగొట్టారు. కొందరు హిట్టు కూడా అందుకున్నారు. మొత్తంగా ఈ మధ్య కాలంలో పాత సినిమా పేర్లతో వచ్చిన కొన్ని సినిమాలేంటో చూద్దాం..
మేజర్ | అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ సినిమా టైటిల్ విషయానికొస్త.. ఈ సినిమా టైటిల్ నటించిన కన్నడ డబ్బింగ్ మూవీ ‘మేజర్’ టైటిల్‌తోనే థియేటర్స్‌లో పలకరించింది. అడివి శేష్ ‘మేజర్’ సినిమాక బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఇక చిరంజీవి నటించిన ‘మేజర్’ మూవీ అప్పట్లో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. (File/Photo)
గాడ్ ఫాదర్ | గాడ్ ఫాదర్ టైటిల్‌తో చిరంజీవి పలకరించారు. ఈ సినిమా టైటిల్‌తో హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఉంది. ఈ సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇదే టైటిల్‌తో ఏఎన్నార్, వినోద్ కుమార్ హీరోలుగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో గతంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చాాల యేళ్లకు అదే టైటిల్‌తో చిరంజీవి మలయాళంలో హిట్టైన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో పలు మార్పులు చేర్పులతో ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. (Twitter/Photo)
ఆడవాళ్లు మీకు జోహార్లు | , రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఒకప్పటి కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా కే.బాలచందర్ దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో తెరకెక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
హీరో | గతంలో నితిన్.. చిరంజీవి ’హీరో’ టైటిల్‌తో ఓ సినిమా చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. ఇక చిరంజీవి నటించిన ‘హీరో’ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. పాత టైటిల్స్ అందులో ఓ గుర్తింపు ఉన్న స్టార్ హీరో సినిమా పాత టైటిల్ పెడితే.. ప్రేక్షకుల్లో ఓ అంచనా ఏర్పడుతోంది. పైగా టైటిలే ఫేస్ ఆఫ్ ఇండెక్స్ అని చెబుతారు. ఓ సినిమాకు పేరు పెట్టడం కూడా ఓ కళనే అని చెప్పాలి. (Twitter/Photo)
ట్విట్టర్ ,అల్లరి నరేష్ బంగారు బుల్లోడు టైటిల్,అల్లరి నరేష్ బాలకృష్ణ బంగారు బుల్లోడు,అల్లరి నరేష్ చిరంజీవి యముడికి మొగుడు,అల్లరి నరేష్ వెంకటేష్ సుందరకాండ,అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్లంట,అల్లరి నరేష్ బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా," width="875" height="583" /> యముడికి మొగుడు | చిరంజీవి యముడికి మొగుడు టైటిల్‌తో హిట్ కొట్టలేకపోయిన అల్లరి నరేష్. ఆ తర్వాత అల్లరి నరేష్ బాలయ్య హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. (File/Photos)
ఘరానా మొగుడు | అటు చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ సినిమా టైటిల్‌తో అంతా కొత్త వాళ్లతో ఓ సినిమా ప్రారంభమైంది. మొత్తంగా చిరు టైటిల్‌తో సినిమా చేస్తే.. ఆ మూవీకి టైటిల్ పరంగా క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఆయా హీరోలు వీలు దొరికితే సూపర్ హిట్ పాత టైటిల్స్‌ను వాడుసుకుంటున్నారు. (Twitter/Photo)