Nusrat Jahan:మొన్న ఎంపీగా గెలుపు.. నిన్న పెళ్లి.. నేడు లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం..

బెంగాలీ సినీ పరిశ్రమలో అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే  ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ భామ ఎంపీగా ఈ రోజు లోక్‌సభలో ప్రమాణం చేసింది. మరోవైపు మరో బెంగాలి నటి.. మిమి చక్రబర్తి కూడా ఈ రోజు ఎంపీగా ప్రమాణం చేసింది. ఈమె తృణముల్ కాంగ్రెస్ తరుపున జాదవ్ పూర్ ఎంపీగా గెలిచింది.