సీతారామకళ్యాణం మూవీతో దర్శకడిగా మారినతారకరాముడు...ఆ తర్వాత ‘గులేభకావళి కథ’, ‘దాన వీర శూర కర్ణ’, ‘చాణక్య చంద్రగుప్తా’, ‘తల్లాపెళ్లామా’ వంటి ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికం వంటి ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి డిఫరెంట్ జానర్ చిత్రాలను తెరకెక్కించి అటు హీరోగానే కాకుండా ఇటు దర్శకడిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారు. (Sr NTR)
ఈ మద్యనే మన దగ్గరున్న చాలా మంది కథానాయకులు...అటుహీరోలుగా నటిస్తునే నిర్మాతలుగా సక్సెస్ సాధించారు. కానీ కొంత మంది మాత్రం ఒక అడుగుముందుకేసి డైరెక్టర్గా సత్తా చాటారు. అటు హీరోగా వుంటూనే దర్శకులుగా మారిన హీరోల విషయానికొస్తే.. ఈ జనరేషన్లో తెలుగులో పవన్ కళ్యాణ్ ముందుంటాడు. ఈయన ‘జానీ’ మూవీతో దర్శకుడిగా మారాడు. ఇక ‘జానీ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా పవన్...దర్శకుడిగా ఆయన కున్న విజన్ ఏందో అందరికీ తెలిసింది. (Twitter/Photo)