మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను నిర్మించాడు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో ’ఆచార్య’ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు తన బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు కూడా. (Twitter/Photos)
గతంలో బాలకృష్ణ ‘బాల గోపాలుడు’,‘ప్రాణానికి ప్రాణం’,సుల్తాన్’,‘నిప్పురవ్వ’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు. కానీ ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి నిర్మాతగా మాత్రం తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సినిమాతో మారాడు. ఈసినిమాకు నిర్మాతగా తన పేరుతో పాటు భార్య వసుంధరా దేవి పేరును కూడా స్క్రీన్ పై వేసుకున్నారు. (Twitter/Photo)
చిరంజీవి తమ్ముడు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ‘రుద్రవీణ’ ‘త్రినేత్రుడు’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. అటు చిరంజీవి అల్లు అరవింద్ నిర్మానంలో గీతా ఆర్ట్స్‌లో ఎక్కువగా నటించారు. ఇపుడు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. (Instagram/Photo)
అక్కినేని నాగేశ్వర రావు కూడా అన్పపూర్ణ పిక్చర్ బ్యానర్లో దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావులతో సంయుక్తంగా పలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడు ఆదుర్తితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై సినిమాలను ప్రొడ్యూస్ చేసాడు. ఆ తర్వాత సోలోగా అన్నపూర్ణ స్టూడియో పతాకంపై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. (twitter/Source)