Jr NTR - Ram Charan - Nikhil | బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్యాన్ ఇండియా లెవల్‌కు పెంచిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసిన పూర్తి సక్సెస్ అయిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ ఇండియా హీరో అనే ఇమేజ్ను తీసుకొచ్చారు. తాజాగా కార్తికేయ 2తో నిఖిల్ సిద్ధార్ధ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. (RRR Collections)
ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హిందీతో పాటు మిగతా దక్షిణాది ప్రేక్షకులను పలకరించారు. అంతకు ముందు రామ్ చరణ్.. జంజీర్ మూవీ రీమేక్‌తో పలకరించినా.. ఆ సినిమాతో విమర్శల పాలయ్యారు. అపుడు తిట్టిన నోళ్లతోనే ఇపుడు పొగడ్తలను వింటున్నాడు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. (Twitter/Photo)
నిఖిల్ సిద్ధార్ధ్ | తాజాగా కార్తికేయ 2 మూవీతో నిఖిల్ బాలీవుడ్లో సత్తా చాటాడు. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో హిందీలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు హిందీలో రూ. 16.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఓవరాల్‌గా రూ. 100 క్లబ్బుకు చేరువలో ఉంది. మొత్తంగా కార్తికేయ 2తో నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. (Twitter/Photo)
దర్శకుడు శంకర్‌కు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు ఒకప్పుడు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధించాయి. ఇంకా చెప్పాలంటే బాయ్స్, అపరిచితుడు లాంటి సినిమాలు తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం అందుకున్నాయి. దానికి ముందు ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, జెంటిల్మెన్ లాంటి సినిమాలు కూడా సంచలన విజయం సాధించాయి. రాజమౌళి కంటే ముందు ఈయన ప్యాన్ ఇండియా దర్శకుడిగా నార్త్‌లో సత్తా చాటాడు. అటు రజినీకాంత్‌తో తెరకెక్కించిన ‘రోబో’, 2.O’ చిత్రాలు దర్శకుడిగా శంకర్ సత్తా ఏంటో చూపించాయి. అటు మణిరత్నం కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రోజా వంటి కొన్ని చిత్రాలతో అలరించారు. (Twitter/Photo)
కేజీఎఫ్ అనే ఒక్క సినిమా ఒక్క సినిమాతో కెరీర్ పూర్తిగా మారిపోవడానికి. అదే యశ్ విషయంలో జరిగింది. మూడేళ్ల కింది వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఈయన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. ఈ యేడాది కేజీఎఫ్ 2 మూవీతో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. మొత్తంగా ప్రభాస్ తర్వాత రెండో ప్యాన్ ఇండియా స్టార్‌గా యశ్ పేరును ప్రస్తావించవచ్చు. (Twitter/Photo)
అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ (Puspa) మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. 2021లో రూ. 350పైగా కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న దక్షిణాది నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 167 కోట్ల షేర్‌తో పాటు రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2021లో మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
’లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నాడు. హీరోగా విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమతో విజయ్ దేవరకొండ సత్తా చాటుతాడా లేదా అనేది చూడాలి. (Instagram/Photo)
ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి తొలి తరం హీరోలు కూడా అప్పట్లో ఎన్టీఆర్ భానుమతి దర్శకత్వంలో ‘చండీ రాణి’ పాతాళ భైరవి’ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు చేసారు. అటు నాగేశ్వరరావు కూడా ‘సువర్ణ సుందరి’ వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు తెలుగు చిత్ర సీమనే నమ్ముకున్నారు. (File/Photo)