నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను కూడా అభిమానులుగా మార్చుకున్న మేటి నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి.. సీరియస్ పాత్రలలో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకొని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. (Twitter/Photo)
కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు రాజేంద్ర ప్రసాద్. ఆయన సొంత ఊరు దొండపాడు స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టిన నిమ్మకూరుకు ఇది సమీపంలో ఉంటుంది. అందుకే ఆయన ఇంటికి తరచూ వెళ్లి వస్తూ ఉండేవాడు రాజేంద్ర ప్రసాద్. అలా చిన్నప్పటినుంచి ఆ తారక రాముడిని చూస్తూ పెరిగాడు రాజేంద్రుడు. ఒక రకం రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీకి రావడానికి ఎన్టీఆర్ కారణం. ఆయన ప్రోత్సాహంతోనే నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఈ సీనియర్ హీరో.
సీనియర్ ఎన్టీఆర్‌తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడు. తన దగ్గరికి వచ్చినపుడు రాజేంద్ర ప్రసాద్ లోని నటనపై ఆసక్తిని గమనించిన సీనియర్ ఎన్టీఆర్.. నటుడిగా మారాలని సలహా ఇచ్చాడు. ఆయన సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు రాజేంద్ర ప్రసాద్. ఇండస్ట్రీకి వచ్చే ముందు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు ఈయన. ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా నటుడిగా మారిపోయాడు రాజేంద్రప్రసాద్.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలి అవకాశం కోసం చాలా మంది కష్టపడుతుంటారు. కానీ రాజేంద్రుడికి మాత్రం అలాంటి సినిమా కష్టాలేం రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే దొరికేసింది. ఫిల్మ్ ఇన్స్ట్యూట్ నుంచి బయటికి వచ్చిన వెంటనే బాపు లాంటి లెజెండరీ దర్శకుడితో పని చేసే అవకాశం అందుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈయన తొలి చిత్రం స్నేహం. బాపు తెరకెక్కించిన ఈ సినిమా 1977 సెప్టెంబరు 5న విడుదలైంది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన మంచు పల్లకి సినిమాలో నటించాడు. ఇందులో చిరంజీవి హీరోగా నటించాడు. అలాగే దర్శకుడు వంశీకి తొలి సినిమా ఇది.
కామెడీకి హీరోయిజం తీసుకొచ్చిన రాజేంద్ర ప్రసాద్.. అన్న ఎన్టీఆర్‌తో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమాలో నటించారు. ఇక ఈయన ఎన్టీఆర్‌కు ఓ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..తాజాగా ఆలీతో సరదగా కార్యక్రమంలో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ
ఆయన వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమాను సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఏఎన్నాఆర్ పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. ఇక ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయించాలనుకున్నారట. కానీ అప్పటికే బాలయ్య.. తన తండ్రి జీవితంపై ఎన్టీఆర్ బయోపిక్‌ను అనౌన్స్ చేశారు.అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను కుదించామన్నారు. ఇక ఈ చిత్రంలో అన్నగారి పాత్రను వెనకాల నుంచి చూపించారు. అందులో ఎన్టీఆర్ పాత్రకు రెండు డైలాగులుంటాయి. ఈ డైలాగులను ఎన్టీఆర్ చెప్పినట్టుగా రాజేంద్ర ప్రసాద్ చక్కగా డబ్బింగ్ చెప్పారన్నారు. అలా అన్న ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పిన చిత్రంగా మహానటి నిలిచిందని అశ్వనీదత్ సరదగా వెల్లడించారు.