కాగా.. తారకరత్న ఆరోగ్యంపై అతని సోదరుడు చైతన్య కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తారకరత్న గుండెపోటు బారిన పడడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రస్తుతం ఆయన అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయి. స్పృహలోకి వస్తే పూర్తి క్లారిటీ వస్తుంది. సోమవారం మరోసారి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని చైతన్య అన్నారు.
గతంలో తారకరత్నకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది అనుకోకుండా జరిగింది. బ్యాడ్ లక్. హార్ట్ స్ట్రోక్ రావడంతో షాక్ కు గురయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం ప్రార్ధిద్దాం అని చైతన్య తెలిపాడు. తారకరత్న కోమాలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చైతన్య కృష్ణ షాకింగ్ వార్త చెప్పాడు. తారకరత్న కోమాలో ఉన్నాడు. అయితే ఆయనకు మరికొన్ని రోజులు వైద్యం అందించాలని డాక్టర్లు చెబుతున్నారన్నారు.
తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ సరిగా కావడం లేదని తాజా హెల్త్ బులిటెన్ లో డాక్టర్లు వెల్లడించారు. దీంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని సినీ లోకంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు.