ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. తెలుగుప్రేక్షక బృందావనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్ (‘రౌద్రం రణం రుధిరం’) అనే సినిమాలో కొమరం భీమ్‌గా పలకరించబోతున్నారు.ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి పండగకు ఒక వారం ముందు థియేటర్స్‌లో సందడి చేయనుంది. (Twitter/Photo)
ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ‘నువ్వు వస్తావని’ డైరెక్టర్ దివంగత వంకినేని రత్నప్రతాప్ డైరెక్ట్ చేసారు. కానీ ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. నవంబర్ 2000లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినపుడు ఎన్టీఆర్ వయసు 17 ఏళ్లు.(jr ntr ninnu chudalani)
ఇక ఎన్టీఆర్ 18వ ఏట ఆయన పుట్టినరోజు తర్వాత 5 రోజులకు మే 25న ఈ మూవీ విడుదలైంది. పూర్తి స్థాయి హీరోగా మారిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం అందుకున్న పారితోషకం రూ. 4 లక్షలు. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఎన్టీఆర్ ఆ డబ్బులను అమ్మ చేతిలో పెట్టారు. అంతేకాదు ఆ డబ్బును ఎన్నో రోజుల పాటు లెక్క పెడుతూ కూర్చున్నాడట. ఈ 21 ఏళ్లలో ఎన్టీఆర్ పారితోషకం ఎన్నో రెట్టు పెరిగింది. (Twitter/Photo)
ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం రూ. 30 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా.. మొత్తం కలుపుకుంటే.. రూ. 50 కోట్ల వరకు ఎన్టీఆర్‌కు దక్కనున్నట్టు సమాచారం. మొత్తంగా ఎన్టీఆర్ 21 ఏళ్ల నట జీవితంలో హీరోగా ఎంతగానో ఎదిగిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే యేడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఆలియా భట్, ఒలివియా మోరీస్ ముఖ్యపాత్రల్లో నటించారు. (Twitter/Photo)