ఇక రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.ఇపుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి.(Trivikram NTR/Twitter)
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.(Twitter/Photo)
అటు ఎన్టీఆర్.. వరసగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలతో సత్తా చూపెట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ టాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారయ్యే అవకాశం ఉంది. (Twitter/Photo)
మొత్తంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువగా చారిత్రక నేపథ్యమున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ప్లాన్ చేయడం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్.. ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. (Jr NTR)