NTR Jr | హైదారబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి దర్శనమిచ్చిన ఎన్టీఆర్..

Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తారక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్‌ల చిత్రాలకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.