NTR Jr: ఎన్టీఆర్ డబుల్ ధమాకా.. ఒకేసారి త్రివిక్రమ్‌తో పాటు మరో స్టార్ డైరెక్టర్ సినిమా చేయనున్న తారక్..

Jr NTR | RRR సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను చేయాలి. ఎపుడు ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఉగాది కానుకగా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో పాటు మరో స్టార్ డైరెక్ట్ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.