ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్, యాంకర్ సుమను కోపంగా చూసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 30 గురించి అప్ డేట్ ఎంటో తెలుసుకోవాలనీ పెద్దగా కేకలు వేశారు. Photo : Twitter
దీంతో ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న సుమ, అభిమానుల ఆసక్తి మేరకు.. ఎన్టీఆర్ 30 గురించి చెప్పాలంటూ ఎన్టీఆర్‌ను అడుగుతారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చాలా సీరియస్‌గా లుక్ ఇవ్వడం.. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ స్పందిస్తూ.. దర్శక నిర్మాతలను ఒత్తిడి చేయ్యోద్దంటూ ఫ్యాన్స్‌ను కోరారు.. ఇక కొరటాల సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ నెలలో సినిమాను ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు ఎన్టీఆర్. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి.. తన నటనతో మైమరిపించారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో గుర్తింపును తెచ్చుకుంటోంది. ఈ చిత్రం 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో ఓ సినిమాను చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు షూట్‌కు వెళ్లనుంది. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రటిమారన్తో ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రీ, ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారట. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట. ఈ విషయంలో త్వరలో ఓ అధికారిక ప్రకటన విడుదలకానుంది. Photo : Twitter
అది అలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే 20 మే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ భారీ గిఫ్ట్‌ను రెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి సినిమాను మే 20న 4K క్వాలిటీలో మరోసారి థియేటర్స్‌లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎన్ని వసూళ్లను రాబట్టనుందో.. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ తరువాత త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివతో తన కెరీర్ 30వ మూవీ చేయనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. కొరటాల డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అయితే ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభం అయ్యి.. ఏప్రిల్ 5, 2024లో విడుదల చేస్తున్నామని తాజాగా అమిగోస్ ఈవెంట్లో ప్రకటించాడు ఎన్టీఆర్.. Photo : Twitter
దీంతో ప్రస్తుతం టీమ్ షూటింగ్ కోసం సెట్స్‌ను వేస్తున్నారు. అత్యంత వైభవంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఓపెనింగ్ షెడ్యూల్‌ను ఇక్కడే చిత్రీకరించనున్నారట. ఈ సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. Photo : Twitter
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథల పట్ల, సన్ని వేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలనీ భావిస్తోందట టీమ్.. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. Photo : Twitter
ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. Photo : Twitter
ఇక మొన్నటి వరకు ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది. దీనికి తోడు ఆమె ప్రస్తుతం ఓ బిడ్దకు తల్లి.. ఇక గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో జాన్వీ కపూర్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. అంతేకాదు దాదాపుగా జాన్వీ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. Photo : Twitter
సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter