యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి.. తన నటనతో మైమరిపించారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో గుర్తింపును తెచ్చుకుంటోంది. 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. Photo : Twitter
ఇక ఇదే లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు టామ్ క్రూజ్ ('టాప్ గన్: మావెరిక్'), పాల్ డానో ('ది బ్యాట్‌మాన్'), మియా గోత్ ('పెరల్'), నీనా హోస్ ('తార్'), జో క్రావిట్జ్ ('కిమీ'), లషానా లించ్ ('ది ఉమెన్ కింగ్', 'మటిల్డా ది మ్యూజికల్'), పాల్ మెస్కల్ ('ఆఫ్టర్సన్'), కేకే పాల్మెర్ ('నోప్') జెరెమీ పోప్ ('ది ఇన్స్పెక్షన్') వంటి నటీ, నటులు ఉన్నారు. చూడాలి మరి యుఎస్ఎ టుడే కథనం ఏమేరకు నిజం అవుతుందో.. ఇక ఇంతకు ముందు కూడా వెరైటీ మ్యాగజైన్ ఎన్టీఆర్ ఆస్కార్ పొందే అవకాశం ఉందన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలిపింది మరో అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ.. ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా, రాజమౌళి ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పేర్కోంది. ఈ క్రమంలో ఉత్తమ నటుడి జాబితాలో విల్ స్మిత్, హ్యూ జాక్మన్ వంటి నటులతో పోటీ పడుతూ ఈ టాప్ 10 జాబితాలో ఎన్టీఆర్ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఓ భారతీయ నటుడు ఇక్కడి దాకా రావడం కూడా ఇదే మొదటిసారని అంటున్నారు. దీంతో తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. Photo : Twitter
ఇక అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు ఆర్ ఆర్ ఆర్ జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాటు నాటు పాట ఆస్కార్ ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యింది. తుది జాబితాను జనవరి 24న ప్రకటిస్తారు. ఇక ఆ తర్వాత మార్చి 12న విన్నర్స్‌కు ఆస్కార్ అవార్డులు ప్రధానం చేస్తారు. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ తరువాత త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివతో తన కెరీర్ 30వ మూవీ చేయనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇంకా తన సినిమాను మొదలు పెట్టలేదు. కొరటాల డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. దీనికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా షూట్ మరో నెలలో మొదలుకానుందని అంటున్నారు. ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. Photo : Twitter
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథల పట్ల, సన్ని వేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలనీ భావిస్తోందట టీమ్.. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. Photo : Twitter
ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. Photo : Twitter
ఇక మొన్నటి వరకు ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది. దీనికి తోడు ఆమె ప్రస్తుతం ఓ బిడ్దకు తల్లి.. ఇక గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో జాన్వీ కపూర్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. అంతేకాదు దాదాపుగా జాన్వీ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. Photo : Twitter
సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter