1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఈ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించారు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు. (Twitter/Photo)
రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు... తమిళంలో తీసిన 'సంపూర్ణరామాయణం’లో. ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ‘రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’ వంటి సినిమాల్లో మర్యాద పురుషోత్తముడి పాత్రలో మెప్పించడం విశేషం. (Twitter/Photo)
అంతేకాదు.. 1977లో ఒకే యేడాదిలో ‘దాన వీర శూర కర్ణ’, ‘అడవిరాముడు’, ‘యమగోల’ వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు అన్నగారు. ఒకే కాలండర్ ఇయర్లో మూడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఇలాంటి రికార్డు..భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదు. అదే యేడాది చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరీ కథ విడుదలై సక్సెస్ సాధించడం విశేషం. (Twitter/Photo)
1979 లో యన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ విరాట్ పర్వం’లో 5 పాత్రలు పోషించి మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, , దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివ శంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు. (Twitter/Photo)
అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగు తున్న దశలోనే తాత, తండ్రి, మనవడు పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాల్ని లెక్కలేనన్ని పోషించారు యన్టీఆర్.(Twitter/Photo)
ఎన్టీఆర సినీ, రాజకీయ జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఆయన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రూపొందించారు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు.