ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా 22 కేంద్రాల్లో శతదినోత్సవం, 5 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, హైదరాబాద్, విజయవాడలో 300 రోజులకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది సర్ధార్ పాపారాయుడు. (Twitter/Photo)
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో రామారావు స్వాతంత్య్ర సమరయోధుని పాత్రలో నటించారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎన్టీఆర్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో కూడా ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో అలరించారు. (Twitter/Photo)
శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ దర్శకుడు నిర్మాత క్రాంతి కుమార్ ఈ సినిమాను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూ. 30 లక్షల వ్యయంతో ‘సర్ధార్ పాపారాయుడు’ తెరకెక్కింది. మొత్తంగా ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 2 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఒక వృద్ద పాత్ర, ఒక యువకుని పాత్రతో డ్యూయల్ రోల్ క్రియేట్ చేసి , దాన్ని ఒక ఫార్ములాగా మార్చిన చిత్రమిది. ఆ ఫార్ములా చిత్రాలకు ‘సర్ధార్ పాపారాయుడు’ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇదే ఫార్ములాను చాలా మంది హీరోలు ఫాలో అయ్యారు. (Twitter/Photo)
స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తండ్రీ కొడుకుల పాత్రలతో దాసరి నారాయణ రావు ఈ కథను రెడీ చేసారు. సర్ధార్ పాపారాయుడు సినిమాను తెలంగాణకు చెందిన సర్వాయి పాపన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకొని ..దానికి కొంత కాల్పనికత జోడించి దాసరి ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి క్రాంతి కుమార్, పాలగుమ్మి పద్మరాజు కథా సహాకారం అందించారు. (Twitter/Photo)
పాపారాయుడు పాత్ర వయసు రీత్యా పెద్దది కావడంతో ఎన్టీఆర్ ఈ పాత్రను చేయరేమో అని ముందుగా అనుకున్నా.. కథ నచ్చడంతో వెంటనే ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పారు. ముందుగా ఈ సినిమాకు ‘పాపారాయుడు’ అనే టైటిల్ అనుకున్నారు. అందులో ఫోర్స్ లేదనుకొని.. ముందు సర్ధార్ పేరు చేర్చి ‘సర్ధార్ పాపారాయుడు’ అని ఈ సినిమాకు పేరు పెట్టారు. (Twitter/Photo)
‘సర్ధార్ పాపారాయుడు’ సినిమా షూటింగ్ జూలై 1 ఉదయం 9 గంటలకు మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది. తల్లీ కొడుకులుగా నటిస్తోన్న ఎన్టీఆర్,శారదలపై మూహూర్తపు సన్నివేశం తెరకెక్కించారు. నైజాం పంపిణీ దారుడు ప్రసాద్ క్లాప్ కొట్టగా.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ వి.యం.సి దొరస్వామిరాజు కెమేరా స్విచాన్ చేశారు. (Twitter/Photo)
ఈ సినిమాలో సలీం నృత్య దర్శకత్వంలో చక్రవర్తి మ్యూజిక్‌లో ఎన్టీఆర్, శ్రీదేవి లపై తెరకెక్కిన పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా హల్లో టెంపర్, ఉయ్యాలకు వయసొచ్చింది, తెల్లచీర కళ్ల కాటుక, 1980 వరకు పాటలతో పాటు వినరా భారత వీర కుమార వంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు స్వాతంత్య్ర సమర నేపథ్యంలో సమకాలీన పరిస్థితులను అద్దం పట్టింది. (Twitter/Photo)
‘సర్ధార్ పాపారాయడు’ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి కేవలం 8 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్. ఒక రకంగా రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి ‘సర్ధార్ పాపారాయుడు’ సినిమా ఓ ప్రేరణగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)