NTR - Chiranjeevi: మన దేశంలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీలు ఏర్పాటు చేసారు. అయితే.. ఎన్టీఆర్, చిరంజీవి మధ్య ఓ టాలీవుడ్ హీరో రాజకీయ పార్టీని స్థాపించారు. (File/Photo)
ఎన్టీఆర్ కంటే ముందు రాజకీయ పార్టీని స్థాపించిన హీరో ఎంజీఆర్. ఎమ్.జి. రామచంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరు ఇది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలా అయితే అన్నగారో.. అక్కడ తమిళనాట ఎమ్జీఆర్ కూడా అంతే. 1972 అక్టోబర్ 17న అన్నాడిఎంకే పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఈయన.
ఎన్టీఆర్, చిరంజీవి మధ్య 1999లో అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించారు హరికృష్ణ. ఈయన పార్టీ 1999 సార్వత్రిక ఎన్నికల్లో తన గంట గుర్తుతో ఎలాంటి ప్రభావం చూపించలేదు. దీంతో ఈయన మళ్లీ టీడీపీలో క్రియా శీలకంగా మారారు. ఆ తర్వాత తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.ఈయన కూడా తెలుగులో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రంలో తండ్రీ తనయులు ఇద్దరు పార్టీ పెట్టడం విశేషం. (File/Photo)
పార్టీ స్థాపించిన వ్యక్తుల్లో హీరోలే కాదు.. హీరయిన్ విజయశాంతి కూడా ఉంది. బీజేపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. రీసెంట్గా తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీలో చేరారు.
మెగాస్టార్గా చక్రం తిప్పుతున్న సమయంలోనే 2018లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు చిరు. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయారు చిరంజీవి. తర్వాత తాను స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో పర్యాటక శాఖ (స్వతంత్య్ర) మంత్రిగా పనిచేసారు. పార్టీని విలీనం చేసినపుడు అభిమానులు ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు చిరంజీవి. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు మెగాస్టార్.
పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని 2014లో జనసేన పార్టీ స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు.(File/Photo)
విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నారు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన.. 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కజగం (DMDK)పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. రీసెంట్గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 234 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. (Twitter/Photo)
ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా 2006లో రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ పరీక్షించుకున్నారు. ఐనా ఒరిగిందేమి లేదు. 2009లో అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాతపించారు. ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. (Ahila India Naadalum Makkal Katchi). ఆ తర్వాత 2018లో ‘మనిత ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి’ అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ( Manitha Urimaigal Kaakkum Katchi on 15 December 2018). ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇపుడు బీజేపీ, అన్నాడీఎంకేతో పొట్టు పెట్టుకున్నారు. ఆ పార్టీల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురి కావడంతో హాస్పటల్ పాలయ్యారు. (Twitter/Photo) (File/Photo)
కమల్ హాసన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా మారిపోయారు. 2018 ఫిబ్రవరి 21న ఈయన ‘మక్కల్ నీది మయ్యమ్’ స్థాపించారు. ఆ పార్టీ తరుపున తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఈ సారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో తృతీయ కూటమిగా కోయంబత్తూర్ దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్తి వనతి శ్రీనివాసన్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. (Twitter/Photo)
తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్నిహీరో విజయ్.. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఏమైనా ఈ సారి మాత్రం తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ పడలేదు. మరోవైపు ఏ పార్టీకి మద్ధతు ఇచ్చేది ప్రకటించలేదు. (File/Photo)