1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలకృష్ణ నటుడిగా అరంగేట్రంచేసారు. ఈ సినిమాలో ‘తాతమ్మ కల’ ను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు. తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ కూడా నటించారు. (Twitter/Photo)
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం ‘శ్రీ మద్విరాట పర్వము’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ,అర్జున, దుర్యోధన, కీచకుడు,బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు. మరోవైపు బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించడం విశేషం. (Youtube/Photo)
ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఈ చిత్రంతో ఎన్టీఆర్ నటన విమర్శల పాలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడి రెండు పాత్రల్లో నటించారు. బాలకృష్ణ.. దుష్యంతుడు, హరిశ్చంద్రుడిగా ద్విపాత్రాభినయం చేసారు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఓ సినిమాల్లో ఇద్దరు రెండు పాత్రల్లో నటించిన వాళ్లు ఎవరు లేరు. (Youtube/Credit)