NTR Amitabh Bachchan | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఐతే అమితాబ్ బచ్చన్ 32 యేళ్ల వయసులో చేసిన పాత్రలను ఎన్టీఆర్ 52 యేళ్ల వయసులో చేసి సూపర్ అనిపించారు. (Twitter/Photo)
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్. ఆంతేకాదు తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఇక అన్న ఎన్టీఆర్ .. అమితాబ్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసారు. (File/Photo)
ఈ ‘జంజీర్’ సినిమాను అదే టైటిల్‌తో రామ్ చరణ్ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా అమితాబ్ బచ్చన్ నటించిన పలు సినిమాలను తెలుగు ప్రేక్షకులు కోసం రీమేక్ చేసారు. అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్ లో చేసిన మరో మూవీ ‘దో అంజానే’. ఈ సినిమాను ఎన్టీఆర్ ‘మా వారి మంచితనం’ పేరుతో రీమేక్ చేసారు. (Twitter/Photo)
షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశారు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశారు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారారు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయారు. (Twitter/Photo)
‘హేరాఫేరి’.. అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్లో ఇదొకటి. ఈ అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని హిందీలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా కలిసి చేశారు. తెలుగులో నందమూరితో అక్కినేని కలిశారు అందుకే ‘రామకృష్ణులు’ అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ స్వీట్ మెమరీ. (Twitter/Photo)