ఈ సినిమాలో ఎన్టీఆర్ బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇదే సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు రానున్న ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సైతం ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాతో ఎన్టీఆర్ ని రంగంలోకి దిగబోతున్నాం అని కొరటాల శివ చెబుతున్నారు.
NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే లొకేషన్స్ సిద్ధం చేసుకున్న కొరటాల.. మొదటి షెడ్యూల్ను శంషాబాద్లో భారీ సెట్ వేసి చిత్రీకరించబోతున్నారట. ఆ వెంటనే రెండో షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సెట్స్ కోసం ఈ మూవీ నిర్మాతలు పెద్ద మొత్తంలో బడ్జెట్ రిలీజ్ చేశారని సమాచారం.