Jr NTR - Koratala Siva - Trivikram | ఎన్టీఆర్.. దాదాపు మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఎలివేషన్ బాగానే ఉన్నా.. ఈయన పాత్రను రామ్ చరణ్ పాత్రతో పోలీస్తే.. తక్కువ చేసినట్టు తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలిచుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్.. ప్యాన్ ఇండియా స్టార్‌గా కాదు కాదు గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. (Twitter/Photo)
ఇక ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ ముందున్న ఇమేజ్ కొండంత పెరిగిపోయింది. కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది. ఎపుడు పట్టాలెక్కాల్సిన ఈ మూవీ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కబోతుంది. కొరటాల శివ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి మెగా తండ్రీ తనయులతో తెరకెక్కించిన ఆచార్య సినిమాతో దర్శకుడిగా విమర్శల పాలైయ్యాడు.ఈ సినిమాను కొరటాల శివనే డైరెక్ట్ చేసారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. (Twitter/Photo)
అయినా.. ఎన్టీఆర్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా.. తన నెక్ట్స్ మూవీని కొరటాల శివతో చేస్తున్నాడు. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవ్వాలని చూస్తున్నారు. ఒక రకంగా కొరటాల శివకు ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఓ ఆయుధంలా దొరికాడు. మరి ఈ ఆయుధాన్ని కొరటాల శివ ఎలా ఉపయోగించి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది చూడాలి. (NTR Koratala siva Photo : Twitter)
అంతకు ముందు త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసి విమర్శల పాలయ్యారు. అంతకు ముందు త్రివిక్రమ్ .. మహేష్ బాబుతో చేసిన ‘ఖలేజా’ సినిమా ఫ్లాపైనా.. టీవీల్లో మాత్రం సక్సెస్ అయింది. కానీ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నిజంగా త్రివిక్రమ్ తెరకెక్కించాడా అనే విమర్శలు వచ్చాయి. NTR-Trivirkam:
ఈ సినిమా ఫ్లాపైనా ఎన్టీఆర్.. తన నెక్ట్ ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్‌తో చేసాడు. ఇక మాటల మాంత్రికుడు కూడా ఎన్టీఆర్ అనే ఆయుధంతో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ దర్శకుడి గత సినిమాల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఛాన్సులు ఇచ్చి సక్సెస్ అందుకున్న దాఖలాలున్నాయి. ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయాల్సిన ఉన్న కథ విషయంలో తేడా కొట్టడంతో ఆగిపోయింది. త్వరలో వీళ్ల కాంబినేషన్ పట్టాలెక్కిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. (Twitter/Photo)
ఆ తర్వాత మహేష్ బాబుతో వన్ ‘నేనొక్కడినే’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సుకుమార్‌తో ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. ‘నాన్నకు ప్రేమతో’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాదించింది. ఈ రకంగా సుకుమార్‌కు ఎన్టీఆర్ అనే ఆయుధాన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడి సక్సెస్ అందుకున్నారు.