చిన్నపుడే ‘రామయణం’లో రాముడిగా అలరించిన ఎన్టీఆర్. అటు తాత ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి’ విశ్వామిత్ర’లో భరతుడిగా నటించిన ఎన్టీఆర్. ఆ సినిమా విడుదల కాలేకపోయింది. వచ్చే యేడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ అనే ప్యాన్ ఇండియా మూవీతో భారతీయ ప్రేక్షకులందరిని పలకరించబోతున్నాడు., (Twitter/Photo)
21 ఏళ్ల కెరీర్లో దాదాపు 30 సినిమాలకు చేరువలో జూనియర్ ఎన్టీఆర్. నేటితో హీరోగా తారక్.. కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. వచ్చే యేడాది జనవరి 7న రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాతో పలకరించనున్న ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. (RRR Bheem teaser)
స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్ చేసిన ‘సుబ్బు’ బాక్సాఫీసు వద్ద సరైన రిజల్ట్ ఇవ్వలేదు. అయినా ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన ‘ఆది’ సూపర్ డూపర్ హిట్టయింది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగులు ..ఎన్టీఆర్ కు మాస్ లో తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ మూవీ సక్పెస్ తో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏంటో చూపించారు జూనియర్ ఎన్టీఆర్.
సింహాద్రి హిట్ తర్వాత జూనియర్‌ను వరుస పరాజయాలు పలకరించాయి. ఆంధ్రావాలా, సాంబ, నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు ఒకదాని వెనక ఒకటి క్యూ కట్టి ఫ్లాపైనా... నటుడిగా తారక్ ఎన్నడూ ఫెయిల్ కాలేదు. ఈ మూవీస్ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రాఖీ’ ఎన్టీఆర్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో తారక్ మహిళ ప్రేక్షకాభిమానం భారీగా సంపాదించాడు.
వినాయక్ డైరెక్షన్లో చేసిన ‘అదుర్స్’ తో యాక్టర్ గా మరో మెట్టెక్కాడు. ఈ సినిమాలో రెండు విభిన్నపాత్రల్లో వైవిధ్యనటన కనబరిచి.. అందరిచేత అదుర్స్ అనేలా చేశాడు జూనియర్. ఈ మూవీలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అందరినీ నవ్వించింది. ఈ మూవీతో తాను హాస్యపాత్రలు సైతం బాగా చేయగలనని నిరూపించుకున్నాడు.(Twitter/Photo)
ఈ సినిమా ఎన్టీఆర్‌లో నెగిటివ్ కోణాన్ని ఆవిష్కరిచింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ’ సినిమా వరకు వరుసగా ఐదు సక్సెస్‌లను అందుకున్నాడు. ఇందులో జై లవకుశలో మూడు విభిన్న పాత్రల్లో అది కూడా ఒకే డ్రెస్ వేసుకొని కేవలంతోనే నటనను పండించి ఔరా అనిపించాడు ఎన్టీఆర్.