ఎన్టీఆర్.. ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఆదర్శప్రాయం. అలాంటి మహనీయుడి శత జయంతి సందర్భంగా ఓ చిన్న కథ తెలుసుకుందాం. అది 1977.. అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒకప్పటిలా మాత్రం విజయం సాధించడం లేదు. బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నాడు కానీ బాక్సాఫీస్ బద్దలైపోయే రికార్డులు మాత్రం రావడం లేదు. (Twitter/Photo)
జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. తనే దర్శకుడిగా, నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేసాడు ఎన్టీఆర్. కేవలం 43 రోజుల్లోనే డివిఎస్ కర్ణ లాంటి అద్భుతాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులకు కొత్త దారి చూపించింది. (Twitter/Photo)