‘రూలర్’ కంటే ముందు బాలకృష్ణ పోలీస్ పాత్రలో నటించిన సినిమాలు ఇవే..
‘రూలర్’ కంటే ముందు బాలకృష్ణ పోలీస్ పాత్రలో నటించిన సినిమాలు ఇవే..
తెలుగు తెరపై ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్ములా పోలీస్ క్యారెక్టర్. ఇప్పటికే చాలా మంది హీరోలు ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకొని మంచి హిట్స్ అందుకున్నారు.తెలుగు సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ..తాజాగా చేస్తోన్న ‘రూలర్’ సినిమాలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ దీపావళి సందర్భంగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ‘రూలర్’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘రూలర్’ సినిమాలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కాక పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. (Twitter/Photo)
2/ 16
మరోవైపు ‘పైసా వసూల్’ సినిమాలో బాలకృష్ణ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. (Facebook/Photo)
3/ 16
‘అల్లరి పిడుగు’ సినిమాలో ఏసీపీ రంజిత్ కుమార్‌గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. (Twitter/Photo)
4/ 16
జయంత్ దర్శకత్వంలో ‘లక్ష్మీ నరసింహా’ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన బాలయ్య (Facebook/Photo)
5/ 16
‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో ఒకటి ఫ్యాక్షనిస్ట్ చెన్నకేశవరెడ్డి పాత్ర కాగా..మరొకటి ఏసీపీ భరత్ పాత్రలో మెప్పించాడు (యూట్యూబ్ క్రెడిట్)
6/ 16
‘సీమ సింహం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన నందమూరి నట సింహం బాలకృష్ణ (Facebook/Photo)
7/ 16
‘భలేవాడివి బాసూ’ సినిమాలో పోలీస్ కాకపోయినా.. దొంగ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసిన బాలకృష్ణ (Facebook/Photo)
8/ 16
‘సుల్తాన్’ సినిమాలో డాన్ సుల్తాన్‌తో పాటు పృథ్వీ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన బాలకృష్ణ (Facebook/Photo)
9/ 16
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాతోపెట్టుకోకు’ సినిమాలో అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రతో పాటు కిట్టయ్య అనే అల్లరి చిల్లరిగా తిరిగే పాత్రలో నటించిన బాలయ్య (Facebook/Photo)
10/ 16
బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలో పవర్ఫుల్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించి మెప్పించాడు. (Facebook/Photo)
11/ 16
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన బాలకృష్ణ (Facebook/Photo)
12/ 16
బాలయ్య మొదటిసారి ముత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. (Twitter/Photo)
13/ 16
పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కాకుండా త్రివిధ దళాలకు చెందిన పాత్రలను పోషించాడు బాలయ్య. అందులో విజయేంద్ర వర్మ సినిమాలో దేశాన్ని రక్షించే సైనికుడి పాత్రలో నటించిన బాలకృష్ణ.(Facebook/Photo)
14/ 16
దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరమవీరచక్ర’లో సమాజాన్ని రక్షించే పోలీస్ పాత్రను కాకుండా దేశాన్ని కాపాడే మిలటరీ ఆఫీసర్‌గా నటించాడు. (Facebook/Photo)
15/ 16
‘అశ్వమేథం’లో పోలీస్ ఆఫీసర్ కాకుండా ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించాడు (Youtube/Credit)
16/ 16
మరోసారి ‘రూలర్’ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కాకుండా డాన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.(Twitter/Photo)