2019లో టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకులైన బాలకృష్ణ,చిరంజీవి కూడా వెండితెరపై బయోపిక్స్‌తో సందడి చేశారు. బాలయ్య.. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో తండ్రి పాత్రలో మెప్పించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో పలకరించారు. (Twitter/Photos)
తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు పార్టులుగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో అత్యద్భుత నటన కనబరిచారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఆదరణ దక్కించుకోలేక అటు హీరోగా.. ఇటు నిర్మాతగా బాలయ్యను నిరాశ పరిచాయి.(Twitter/Photos)
డిఫరెంట్ కథలతో కెరీర్లో ముందుకు సాగుతున్న నాని ఈ యేడాది ‘జెర్సీ’ సినిమాతో పలకరించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘జెర్సీ చితర్ ప్రముక క్రికెటర్ రమణ్ లాంబ జీవితానికి దగ్గర ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ చిత్ర దర్శక,నిర్మాతలు మాత్రం ఇదొక ఫిక్షన్ స్టోరీ అని చెబుతున్నారు. ఆడియన్స్ ఈ చిత్రంలో ఒక క్రికెటర్ జీవితాన్నే చూసారు.
మన తెలిసిన ప్రపంచంలో తెలియని విజేతలుగా ఎందరో ఉంటారు. అలాంటి వాళ్లు జీవితాలు ఎందరికో స్పూర్తిని నింపుతుంటాయి. ప్రముఖ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. ఆసు యంత్రం కోసం తన జీవితాన్నే ధారబోసిన చింతకంది మల్లేశం జీవితం ఎందరికో స్పూర్తిని నింపింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే సాధించింది. (Twitter/Photo)
ఈ ఇయర్ టాలీవుడ్లో చివరగా వచ్చిన బయోపిక్ ‘జార్జిరెడ్డి’. ఐదు దశాబ్దాల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్ధి వర్గానికి చెందిన నాయకుడు జార్జిరెడ్డి. ఇప్పటికే జార్జిరెడ్డి ప్రేరణగా పలువురు పలు రకాలుగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. తాజాగా సందీప్ మాధవ్ (సాండీ) హీరోగా నటించిన ఈ చిత్రానికి దళం ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. (Twitter/Photo)