NOT ONLY NAARAPPA MOVIE THESE ARE THE REMAKE MOVIES FROM OTHER LANGUAGES DONE BY TOLLYWOOD HERO VENKATESH TA
నారప్ప సహా వెంకటేష్ తన ఫిల్మ్ కెరీర్లో రీమేక్ చేసిన చిత్రాలు ఇవే..
మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ.. తాజాగా తమిళంలో హిట్టైయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫప్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో కలిపి మొత్తంగా వెంకటేష్ వేరే భాషల్లో సక్సెస్ అయిన ఎన్ని చిత్రాలను రీమేక్ చేసాడో మీరు కూడా ఓ లుక్కేయండి..
తాజాగా వెంకటేష్.. ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో ప్రారంభమైంది. (twitter/Photo)
2/ 32
తమిళంలో మాధవన్ హీరోగా నటించిన ‘ఇరుదు సుట్రు’.. హిందీలో ‘సాలా ఖడూస్’ సినిమాను తెలుగులో ‘గురు’గా రీమేక్ చేసి హిట్టు అందుకున్నాడు. (Twitter/Photo)
3/ 32
హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రాన్నితెలుగులో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’గా రీమేక్ చేసి ఓకే అనిపించాడు. (Twitter/Photo)
4/ 32
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. (Twitter/Photo)
5/ 32
హిందీలో అజయ్ దేవ్‌గణ్,అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించిన ‘బోల్ బచ్చన్’ సినిమాను తెలుగులో ‘మసాలా’గా చూపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. (twitter/Photo)
6/ 32
మలయాళంలో దిలీప్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ సినిమాను అదే టైటిల్‌తో ముందుగా సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా.. ఆ తర్వాత వెంకటేష్ తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేసి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. (Twitter/Photo)
7/ 32
కన్నడలో విష్ణువర్దన్ హీరోగా నటించి సూపర్ హిట్టైన ‘ఆప్తరక్షక’ సినిమాను తెలుగులో ‘నాగవల్లి’గా రీమేక్ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
8/ 32
హిందీలో అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా ముఖ్యపాత్రల్లో నటించిన ‘ది వెడ్నెస్ డే’ సినిమాను తెలుగులో కమల్ హాసన్, వెంకటేష్ ‘ఈనాడు’గా రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
9/ 32
తమిళంలో మమ్ముట్టి హీరోగా నటించిన ‘ఆనందన్’ సినిమాను తెలుగులో ‘సంక్రాంతి’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకటెష్.(Twitter/Photo)
10/ 32
తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘కాక కాక’ సినిమాను తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఘర్షణ’గా రీమేక్ చేసాడు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. (Twitter/Photo)
11/ 32
విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వసంతం’ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కింది. తమిళంలో మాధవన్ హీరోగా ‘ప్రియమైన తోలి’గా తెరకెక్కించారు. ఇది రీమేక్ అని చెప్పలేము. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. (youtube/Photo)
12/ 32
తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన ‘జెమిని’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (twitter/Photo)
13/ 32
తమిళంలో లివింగ్స్టన్ హీరోగా నటించిన ‘సొల్లమలె’ సినిమాను తెలుగులో ‘శీను’గా రీమేక్ చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Facebook/Photo)
14/ 32
తమిళంలో కార్తీక్, అజిత్ హీరోలుగా నటించిన ‘ఉన్నిదతిల్ ఎన్నై కొడుతెన్’ సినిమాను తెలుగులో ‘రాజా’గా రీమేక్ చేసాడు. ఈ సినిమాలో ఇంకో కథానాయకుడిగా అబ్బాస్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. (facebook/Photo)
15/ 32
తమిళంలో శరత్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశం’ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్. (Facebook/Photo)
16/ 32
తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేస్తే సూపర్ హిట్‌గా నిలిచింది. (facebook/Photo)
17/ 32
తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా నటించిన ‘యమలీల’ సినిమాను హిందీలో ‘తక్దీర్వాలా’గా రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
18/ 32
హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా హీరోగా నటించిన ‘ఆంఖే’ సినిమాను తెలుగులో ‘పోకిరి రాజా’గా రీమేక్ చేసాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (twitter/Photo)
19/ 32
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముద్దుల ప్రియుడు’ చిత్రం1965లో హాలీవుడ్లో వచ్చిన ‘ది సౌంద్ ఆఫ్ మ్యూజిక్’ఆధారం. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.(Facebook/Photo)
20/ 32
తమిళంలో కే.భాగ్యరాజా హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘ఎంగ చిన్నరాజా’ సినిమాను హిందీలో అనిల్ కపూర్ హీరోగా ‘బేటా’గా రీమేక్ చేసాడు. ఆ తర్వాత వెంకటేష్ ‘అబ్బాయిగారు’ గా రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
21/ 32
తమిళంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నామలై’ సినిమాను తెలుగులో ‘కొండపల్లి రాజా’గా రీమేక్ చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. (Facebook/Photo)
22/ 32
తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన తంబీ’ సినిమాను తెలుగులో వెంకటేష్ ‘చంటి’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీలో వెంకటేష్ ‘అనారి’గా రీమేక్ చేసి అక్కడా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం విశేషం. (Youtube/Photo)
23/ 32
తమిళంలో కే.భాగ్యరాజా దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన ‘సుందరకాండమ్’ సినిమాను తెలుగులో ‘సుందరకాండ’ రీమేక్ చేసి ఇక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు. (Youtube/Photo)
24/ 32
తమిళంలో విజయ్ కాంత్ హీరోగా నటించిన ‘చిన గౌండర్’ సినిమాను తెలుగులో బి.గోపాల్ దర్శకత్వంలో ‘చినరాయుడు’గా రీమేక్ చేసాడు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. (facebook/Photo)
25/ 32
తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన తంబీ’ సినిమాను తెలుగులో వెంకటేష్ ‘చంటి’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీలో వెంకటేష్ ‘అనారి’గా రీమేక్ చేసి అక్కడా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం విశేషం.(Youtube/Photo)
26/ 32
హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ నటించిన ఆల్ టైమ్ హిట్ ‘తేజాబ్’ సినిమాను తెలుగులో వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లుగా దాసరి నారాయణ రావు ‘టూ టౌన్ రౌడీ’గా రీమేక్ చేసాడు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
27/ 32
‘ధ్రువనక్షత్రం’ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ చిత్రానికి రీమేక్. ఇదే కథతో బాలకృష్ణ హీరోగా ‘అశోక చక్రవర్తి’ సినిమా తెరకెక్కింది. బాలయ్య ‘అశోక చక్రవర్తి’ బాక్పాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిస్తే.. వెంకటేష్ ‘ధ్రువ నక్షత్రం’ సూపర్ హిట్టైయింది.(Youtube/Credit)
28/ 32
ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారసుడొచ్చాడు’ సినిమా.. తమిళ చిత్రం ‘తీర్ధ కరైయినిలే’ చిత్రానికి రీమేక్. అక్కడ మోహన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Facebook/Photos)
29/ 32
తమిళంలో రఘువరణ్ హీరోగా నటించిన ‘మైఖేల్ రాజ్’ సినిమాను దాసరి దర్శకత్వంలో ‘బ్రహ్మపుత్రుడు’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. (facebook/Photo)
30/ 32
బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ చిత్రం..యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ‘తైమేల్ ఆనాయ్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం బెంగాలీ చిత్రం ‘ప్రతీకార్’ ఆధారంగా తెరకెక్కింది. తెలుగులో వెంకటేష్‌కు మంచి సక్సెస్ అందించింది ఈ చిత్రం. (Facebook/Photo)
31/ 32
హిందీలో అమితాబ్ బచ్చన్, శతృఘ్న సిన్హా, రిషీ కపూర్ హీరోలుగా నటించిన ‘నసీబ్’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా ‘త్రిమూర్తులు’గా రీమేక్ చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (twitter/Photo)
32/ 32
హిందీలో సన్ని డియోల్ హీరోగా నటించిన ‘అర్జున్’ సినిమాను తెలుగులో ‘భారతంలో అర్జునుడు’గా రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. (twitter/Photo)