కాజల్ అగర్వాల్ సహా మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మలుగా కొలువు తీరింది వీళ్లే..

దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.