NOT ONLY AADI SAI KUMAR PLAYED SOLDIER CHARECTER IN OPERATION GOLD FISH MOVIE AND THESE ARE THE TOLLYWOOD HEROES PLAYED SOLDIER CHARECTERS IN TELUGU CINEMA TA
Operation Gold Fish: తెలుగు తెరపై సైనికుడి పాత్రల్లో నటించిన హీరోలు వీళ్లే..
జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు దేశానికి రైతుతో పాటు సైనికుడు వెన్నుముక. అలాంటి సైనికుల పాత్రలు పోషించిన తెలుగు హీరోలు వీలైనపుడల్లా చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆది సాయి కుమార్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలో సైనికుడి పాతర్లో మెప్పించారు.ఆది సాయి కుమార్ కాకుండా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు సైనికుడి పాత్రలో అలరించనున్నారు. వీళ్లే కాకుండా.. సైనికుల పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..
ఆపరేషన్ గోల్డ్ఫిష్లో ఎన్ఎస్జీ కమెండోగా ఆది సాయికుమార్ (Twitter/Photo)
2/ 31
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో సైనికుడి పాత్రలో నటించిన ఆది సాయి కుమార్ (twitter/Photo)
3/ 31
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. (Twitter/Photo)
4/ 31
అల్లు అర్జున్ కూడా ‘సరైనోడు’,‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో సైనికుడి పాత్రలో నటించాడు. (Twitter/Photo)
5/ 31
‘మెహబూబా’లో పాక్ సైనికుడి పాత్రలో నటించిన ఆకాష్ పూరీ (Twitter/Photo)
6/ 31
‘యుద్ధ భూమి’లో సైనికుడి పాత్రలో నటించిన మోహన్ లాల్, అల్లు శిరీష్ (Twitter/Photo)
7/ 31
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’లో సైనికకుడి పాత్రలో మెప్పించిన వరుణ్ తేజ్ (Twitter/Photo)
8/ 31
‘ఘాజీ’లో నేవీ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన రానా (Twitter/Photo)
9/ 31
మహేష్ బాబు నిర్మాణంలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో 26/11 ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమాలో అడివి శేష్.. మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు. (Twitter/Photo)
10/ 31
కొమరం పులిలో ‘ఎన్ఎస్జీ’కమెండోగా నటించిన పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
11/ 31
శక్తి సినిమాలో NSG కమెండో పాత్రలో నటించిన ఎన్టీఆర్ (Twitter/Photo)
12/ 31
నాగార్జున ‘కెప్టెన్ నాగార్జున’, ‘నిన్నే ప్రేమిస్తే’, ‘LOC’, గగనం సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించారు. (Twitter/Photo)
13/ 31
నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ‘మంగమ్మ గారి మనవడు’, ‘విజయేంద్ర వర్మ,’ ‘పరమవీరచక్ర’ సినిమాల్లో సైనికుడి పాత్రలో నటించి మెప్పించారు. (Twitter/Photo)
14/ 31
చిరంజీవి ‘యుద్ధభూమి’ స్టాలిన్ సినిమాలతో పాటు ‘మేజర్’ అనే కన్నడ డబ్బింగ్ సినిమాలో సైనికుడి పాత్రలో మెప్పించడం విశేషం. (Twitter/Photo)
15/ 31
ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ కలిసి నటిస్తోన్న ‘వెంకీమామ’లో సీనియర్ హీరో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
16/ 31
‘మగాడు’, రాజ సింహం’,‘ఎవడైతే నాకేంటి’ వంటి పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించిన రాజశేఖర్ (యూట్యూబ్ క్రెడిట్)
17/ 31
‘చంటి’ సినిమాలో సైనికుడి పాత్రలో ఒదిగిపోయిన రవితేజ (యూట్యూబ్ క్రెడిట్)
18/ 31
సాయి కుమార్ పలు సినిమాల్లో సైనికుడి పాత్రల్లో మెప్పించడం విశేషం (యూట్యూబ్ క్రెడిట్)
19/ 31
’అడవిలో అభిమన్యుడు’లో జగపతి బాబు,వినోద్ కుమార్ సైనికుల పాత్రల్లో నటించారు. (యూట్యూబ్ క్రెడిట్)
20/ 31
‘స్నేహమంటే ఇదేరా’ లో సైనికుడి పాత్రలో మెప్పించిన సుమంత్ (యూట్యూబ్ క్రెడిట్)
21/ 31
‘శ్రీశైలం’ మూవీలో మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. (యూట్యూబ్ క్రెడిట్)
22/ 31
‘వన్ మ్యాన్ ఆర్మీ’లో ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన సుమన్ (ఫైల్ ఫోటో)
23/ 31
మోహన్ బాబు కూడా సురేష్ కృష్ణ దర్శకత్వంలో దాసరి నారాయణ రావు ముఖ్యపాత్రలో నటించిన ‘మేస్త్రీ’లో సైనికుడి పాత్రలో యాక్ట్ చేసిన మోహన్ బాబు (యూట్యూబ్ క్రెడిట్)
24/ 31
మరోవైపు ‘మేస్త్రీ’ సినిమాలో దాసరి నారాయణ రావు కూడా సైనికుడి పాత్రలో నటించడం విశేషం (యూట్యూబ్ క్రెడిట్)
25/ 31
‘జై హింద్’ సహా పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ (యూట్యూబ్ క్రెడిట్)
26/ 31
ఎన్టీఆర్ కూడా బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సహా పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించారు. (Twitter/Photo)
27/ 31
ఏఎన్నాఆర్ కూడా సిపాయి చిన్నయ్య సహా పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించడం విశేషం. (యూట్యూబ్ క్రెడిట్)
28/ 31
సూపర్ స్టార్ కృష్ణ కూడా ‘భారత సింహం’ సహా పలు సినిమాల్లో బ్రిగేడియర్ పాత్రలో మెప్పించారు. (యూట్యూబ్ క్రెడిట్)
29/ 31
శోభన్ బాబు కూడా ‘మహా సంగ్రామం’ వంటి కొన్ని సినిమాల్లో సైనికుడి పాత్రలో మెప్పించడం విశేషం. (యూట్యూబ్ క్రెడిట్)
30/ 31
‘భారతరత్న’లో విజయశాంతి ఆర్మీ మేజర్ పాత్రలో నటించింది. (యూట్యూబ్ క్రెడిట్)
31/ 31
మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా తెలుగులో సైనికుడి పాత్ర చేసిన హీరోలు చాలా మందే ఉన్నారు. (Twitter/Photo)