గతంలో బాలకృష్ణ ‘బాల గోపాలుడు’,‘ప్రాణానికి ప్రాణం’,సుల్తాన్’,‘నిప్పురవ్వ’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు. కానీ ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి నిర్మాతగా మాత్రం తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సినిమాతో మారాడు. ఈసినిమాకు నిర్మాతగా తన పేరుతో పాటు భార్య వసుంధరా దేవి పేరును కూడా స్క్రీన్ పై వేసుకున్నారు. (ట్విట్టర్ ఫోటో)
అక్కినేని నాగేశ్వర రావు కూడా అన్పపూర్ణ పిక్చర్ బ్యానర్లో దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావలతో సంయుక్తంగా పలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడు ఆదుర్తితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై సినిమాలను ప్రొడ్యూస్ చేసాడు. ఆ తర్వాత సోలోగా అన్నపూర్ణ స్టూడియో పతాకంపై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. (twitter/Source)