Rashmika: అదృష్టం అంటే రష్మికదే.. ఆమె టైం మాములుగా లేదుగా
Rashmika: అదృష్టం అంటే రష్మికదే.. ఆమె టైం మాములుగా లేదుగా
రష్మిక మందన్న అదృష్టం మామూలుగా లేదు. వరుసగా ఈ అమ్ముడుకు అదిరే ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అగ్రహీరోల సరసన నటించిన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు మరో యంగ్ స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్గా దాదాపు ఫిక్స్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ముందుగా ఆలియా భట్ అనుకున్నారు. ఆ ప్లేస్‌ను రష్మిక ఇప్పుడు కొట్టేసింది.
అతి కొద్ది సినిమాలతోనే.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది మందన. తాజాగా పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది.
2/ 14
వరుసగా టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించేస్తోంది రష్మిక. అల్లు అర్జున్‌తో పుష్ప చేసిన ఈ ముద్దుగుమ్మ,. గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో జతకట్టింది. సరిలేరు నీకెవ్వరూలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ పక్కన కూడా నటించింది.
3/ 14
కన్నడ బ్యూటీ అయిన రష్మిక .. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలిసారిగా ఆమె నాగశౌర్యతో జంటగా ఈ సినిమాలో మెరిసింది.
4/ 14
ప్రస్తుతం రష్మిక మరో అదిరే ఆఫర్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో మరో స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వచ్చేసింది, యంగ్ హీరో తారక్‌తో రష్టిక కలిసి నటించనుంది.
5/ 14
అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ముందుగా మరో హీరోయిన్ను అనుకున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఆలియా భట్. అయితే ఆలియా భట్ నో చెప్పడంతో ఇప్పుడా ఆ ప్లేస్ రష్మికకు దక్కింది.
6/ 14
కొరటాల తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు.
7/ 14
గత వారం రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. మొత్తానికి ఎన్టీఆర్ కి అలియా షాక్ ఇచ్చింది.
8/ 14
అయితే, ఆలియా భట్ ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో రష్మిక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ హీరో ఎన్టీఆర్‌కు జంటగా కనిపించనుంది.
9/ 14
ప్రస్తుతం పుష్ప -2 కు సంబంధించి సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉంటోంది రష్మిక. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ ఉన్నది.
10/ 14
మొదట కన్నడలో రష్మిక కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తరువాత టాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అలా ప్రస్తుతం ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ.
11/ 14
'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. దీంతో రష్మిక కూడా ఈ ఆఫర్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
12/ 14
మరోవైపు యూవీ క్రియేషన్స్ టీమ్... రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటోంది. ఎట్టకేటకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
13/ 14
మరోవైపు తమిళ్ హీరో విజయ్‌తో కూడా రష్మిక జంటగా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీలో రష్మిక నటించనుంది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.
14/ 14
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. గతేడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవుతుంది.