మొరాకో, కెనడా ఫ్యామిలీకి చెందిన నోరా... ప్రస్తుతం తనది ఇండియన్ హార్టే అంటోంది. పుట్టి, పెరిగిందంతా కెనడాలోనే అయినా... బాలీవుడ్‌కి వచ్చాక... ఇక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్లో రోర్... టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా... తెలుగులో టెంపర్, బాహుబలి, కిక్-2 సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి... పాపులార్టీ సంపాదించుకుంది. (Image Credit : Instagram)
ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది. 2016లో బిగ్ బాస్ 9లో డే 84లో తళుక్కుమన్న నోరా... టీవీ రియాల్టీ డాన్స్ షో ఝలక్ దిఖలా జా లో కూడా పాల్గొంది. తాజాగా టీ-సిరీస్‌తో డీల్ కుదుర్చుకున్న ఫతేహీ... టీ-సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. (Image Credit : Instagram)