దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai)లో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గోని సందడి చేవారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా.. నీతా అంబానీని ఆకాశానికి ఎత్తేసారు.
NMACC వంటి కల్చరల్ సెంటర్ మన దేశానికి ఎంతో సహాయకారికగా ఉండబోతుందని చెప్పారు. ముంబై నగరంతో తనకు ఎంతో అనుబంధం ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నగరంలో రిలయన్స్ సిటీ వంటి మరో నగరం ఏర్పాటు చేయడం అంబానీల వల్లే సాధ్యమైందన్నారు. ఓ నగరాన్ని నిర్మించడం మీ వల్లే సాధ్యమైన విషయాన్ని ప్రస్తావించారు.
NMACC కేంద్రం ముంబైలోని బాంద్రా -కుర్లా కాంప్లెక్స్‌లోని జియో గ్లోబల్ సెంటర్లో ఉన్న NMACCలో నిర్మించారు. ముఖ్యంగా భారతీయ కళలును పరిరక్షించడానికి, వాటిని ప్రోత్సహించే భాగంలో ఈ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఈ కేంద్రం ప్రారంభోత్సవంలో అంబానీ దంపతులు పేర్కొన్నారు. పైగా ఈ సెంటర్ పై రజినీకాంత్, సల్మాన్, దీపికా, షారుఖ్, రణ్వీర్ సింగ్ వంటి ప్రముఖులు ప్రశంసలు కురపించారు. అంబానీల దార్శనికతను కొనియాడారు. . (Photo: Viral Bhayani)
ఈ కార్యక్రమంలో హిందీ నటులు షారుఖ్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్, స్పైడర్ మ్యాన్ సినిమాలో నటించిన టామ్ హాలండ్, నటి జెండియా, అనుష్క దండేకర్ తదితరులు పాల్గోన్నారు. లాంచ్ ఈవెంట్‌కు ముందుగా వచ్చిన వారిలో అమీర్ ఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.ఈ వేడకలో సోనమ్ కపూర్.. పంజాబీ సాంప్రదాయ కనువిందు చేసింది. Photo : Viral Bhayani