NMACC Launch Pics : దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai)లో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గోని సందడి చేవారు. ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్,శ్రద్ధా కపూర్, రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో హిందీ నటులు షారుఖ్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్, స్పైడర్ మ్యాన్ సినిమాలో నటించిన టామ్ హాలండ్, నటి జెండియా, అనుష్క దండేకర్ తదితరులు పాల్గోన్నారు. లాంచ్ ఈవెంట్‌కు ముందుగా వచ్చిన వారిలో అమీర్ ఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.ఈ వేడకలో సోనమ్ కపూర్.. పంజాబీ సాంప్రదాయ కనువిందు చేసింది. Photo : Viral Bhayani