ముంబై (Mumbai)లో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గోన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Viral Bhayani
ఈ కార్యక్రమంలో హిందీ నటులు షారుఖ్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్, స్పైడర్ మ్యాన్ సినిమాలో నటించిన టామ్ హాలండ్, నటి జెండియా, అనుష్క దండేకర్ తదితరులు పాల్గోన్నారు. లాంచ్ ఈవెంట్‌కు ముందుగా వచ్చిన వారిలో అమీర్ ఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. Photo : Viral Bhayani
ఈ ఈవెంట్లో ఇటీవల లాల్ సింగ్ చద్దాతో పలకరించిన నటుడు అమీర్ ఖాన్ కనిపించి తన కొత్త లుక్ లో అదరహో అనిపించారు. అతను ఈ ఈవెంట్లో ఒక డెనిమ్ ప్యాంట్‌తో పాటు ఆకుపచ్చ కుర్తాలో కేక పెట్టించాడు. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కూడా సందడి చేసింది. ఆమె నలుపు, తెలుపు దుస్తులను ధరించింది. ఇక ఆమెకు కాబోయే భర్త నుపుర్ షికారే టక్సేడో ధరించారు. అమీర్‌తో పాటు అతని కుమారులు జునైద్ ఖాన్, ఆజాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోని సందడి చేశారు. Photo : Viral Bhayani